సొంతూరులో హోమ్ టూర్ చేసిన శాంతి స్వరూప్.. వైరల్ అవుతున్న వీడియో?

ప్రస్తుత కాలంలో అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ షాపింగ్ వీడియోలు, బెడ్ రూమ్ టూర్లు, హోం టూర్ లు అంటూ వీడియోస్ చేస్తున్నారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇలా వీడియోస్ చేస్తూ పాపులర్ అవుతూ..బాగానే డబ్బు సంపాదిస్తున్నారు.ఇలా చాలామంది బుల్లితెర నటీనటులతో పాటు కామెడీ షోస్ ద్వార పాపులర్ అయిన వారు కూడా ఇలా హోం టూర్ వీడియోలు చేస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ కూడా తన సొంత ఊర్లో ఉన్న ఇంటిని చూపిస్తూ వీడియో చేశాడు.

జబర్దస్త్ లో కమెడియన్లు ఎంత పాపులర్ అయ్యారో.. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ ద్వారా కూడా చాలామంది పాపులర్ అయ్యారు. ఇలా లేడీ గెటప్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో శాంతి స్వరూప్ కూడా ఒకరు. శాంతి స్వరూప్ ఎక్కడికి వెళ్ళినా లేడీ గెటప్ లోనే కనిపిస్తూ ఉంటాడు. అందువల్ల శాంతి స్వరూప్ జబర్దస్త్ శాంతిగా బాగా పాపులర్ అయ్యాడు. అందరి సెలబ్రిటీల లాగే జబర్దస్త్ శాంతి స్వరూప్ కూడా తమ గ్రామంలో ఉన్న సొంత ఇంటి హోమ్ టూర్ వీడియో చేశాడు. నెల్లూరు జిల్లా, జిట్రగుంట గ్రామంలో శాంతి స్వరూప్ జన్మించాడు. శాంతి స్వరూప్ చిన్నతనం అంతా ఆ ఇంట్లోనే గడిచిపోయింది.

ప్రస్తుతం వృత్తిపరంగా శాంతి స్వరూప్ హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఇటీవల తన సొంత గ్రామానికి వెళ్లిన శాంతి తమ గ్రామంలో ఉన్న ఇంటిని చూపిస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. జీవితంలో ఎదగటానికి కష్టపడుతూ తన సొంత ఊరినే మర్చిపోయానని.. తన సొంత ఊరికి వచ్చి ఎన్నో ఏళ్ళు గడిచిపోయిందని శాంతి స్వరూప్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ హోమ్ టూర్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది