దిల్ దియా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆ సెన్సేషనల్ డైరెక్టర్ చేతుల మీదుగా విడుదల!

Dil Diya: వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న చైత‌న్య‌రావు మ‌దాడి క‌థానాయ‌కుడిగా వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ కె.క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న రా అండ్ రూటెడ్ ఫిల్మ్ ‘దిల్ దియా’. ‘ఏ నేక్డ్ ట్రూత్’ అనేది ట్యాగ్ లైన్. శ్రియాస్ చిత్రాస్‌, ఎ పూర్ణ నాయుడు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్‌పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్‌ను సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను గ‌మ‌నిస్తే.. బ‌ట్ట‌లు లేకుండా సొఫాలో కూర్చున్న చైత‌న్య రావును చూడొచ్చు. త‌ను ర‌గ్డ్ లుక్‌తో స్క్రీన్‌ను సీరియ‌స్‌గా చూస్తున్నాడు. వెనుక నుంచి ప్రొజెక్ట‌ర్ లైటింగ్ వ‌స్తోంది. త‌న చూపుల్లోని ఇంటెన్సిటీ త‌న పాత్ర‌లోని సీరియ‌స్‌నెస్‌ను తెలియ‌జేస్తోంది.

https://x.com/i/status/2007338072154013783

ఈ సంద‌ర్భంగా… చిత్ర నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ ‘‘డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్‌, సెన్సిబుల్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన దర్శకుడు క్రాంతి మాధవ్‌గారు.. మ‌రోసారి ‘దిల్ దియా’తో స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. చైత‌న్య‌రావు మదాడిని న్యూ అవ‌తార్‌లో చూడ‌బోతున్నారు. రా ఎమోష‌న్స్‌ను అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తున్నాం. ప్రేమ, మమకారం, వైఫల్యం, స్వీయ గౌరవం వంటి ఎలిమెంట్స్‌ను సినిమాటిక్ లాంగ్వేజ్‌లో ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రిస్తున్నారు. ‘దిల్ దియా’ను స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

*న‌టీన‌టులు:*

చైత‌న్య‌రావు మ‌దాడి, ఇరా, స‌ఖి, జెస్సీ త‌దిత‌రులు

*సాంకేతిక వ‌ర్గం:*

బ్యాన‌ర్స్‌: శ్రియాస్ చిత్రాస్‌, ఎ పూర్ణ నాయుడు ప్రొడ‌క్ష‌న్‌

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: కె.క్రాంతి మాధ‌వ్

నిర్మాత : పూర్ణ నాయుడు

స‌హ నిర్మాత‌: శ్రీకాంత్.వి

సినిమాటోగ్ర‌ఫీ: పి.జి.విందా

సంగీతం: ఫ‌ణి క‌ళ్యాణ్‌

ఎడిటింగ్‌: రా- షా (ర‌వి- శ‌శాంక్‌)

ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: చిన్నా

ప‌బ్లిసిటీ డిజైన్‌: ధ‌ని ఏలే

డిజిటల్ మార్కెటింగ్: స‌్టార్ స‌ర్కిల్‌

పి.ఆర్‌.ఒ: ఎస్‌.కె.నాయుడు, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా)