అశోక్ గజపతిరాజు మీద ఇన్నాళ్లు పెద్దగా రాజకీయ విమర్శలు ఏవీ లేవు. అవినీతి ఆరోపణలు, అక్రమాలు చేశారనే విమర్శలు ఆసలే లేవు. స్వతహాగా రాజు కావడం, పూసపాటి వంశానికి ఘన చరిత్ర ఉండటంతో ఆయన మీద ప్రత్యర్థులు సైతం సున్నితమైన విమర్శలే తప్ప ఏనాడూ అగౌరవ రీతిలో మాట్లాడింది లేదు. కానీ కుటుంబ పరమైన వివాదాలు ఆయన్ను ఇబ్బందిపెడుతున్నాయి. స్వయంగా అన్న కుమార్తె ఆయన మీద యుద్దానికి దిగారు. విజయరామ గజపతిరాజు పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజుకు రెండు వివాహాలు. మొదటి భార్య ఉమకు ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరే సంచయిత గజపతి. వైసీపీ పాలన వచ్చాక అశోక్ గజపతిరాజును పక్కకు తప్పించి సంచయితను ధర్మకర్తను చేశారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలన్నీ ఆమె చేతుల్లోనే ఉన్నాయి.
ఇటీవల ఆయన ధర్మకర్తగా ఉన్న ఇంకొన్ని దేవాలయాల నుండి కూడ ప్రభుత్వం ఆయన్ను తొలగించింది. రామతీర్థం విగ్రహ ధ్వంసం ఆరోపణలు కూడ ఆయన మీద వేస్తున్నారు వైసీపీ నేతలు. ఇదిలా ఉంటె ఈరోజు ఎన్టీఆర్ వర్థంతి కావడంతో అశోక్ గజపతిరాజు రామారావుగారిని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని పార్టీ పురోభివృద్ధికి తొడ్పడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన టీడీపీ నేత కాబట్టి ఈరకమైన వ్యాఖ్య చేశారు. కానీ వెంటనే సంచయిత గజపతి మధ్యలో దూరిపోయారు. పార్టీ పెట్టుకుని సొంతకాళ్ల మీద అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను పదవినుంచి తప్పించి ఆయన మరణానికి కారకులైన వ్యక్తుల్లో చంద్రబాబుగారితో పాటు అశోక్ గజపతిరాజుగారు ఒకరు. వీరిని పార్టీని నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్ ఆరోజు రాసిన లేఖ ఇది. ఆనాటి కుట్రలో ఎవరు ఉన్నారో చెప్పే సాక్ష్యం ఇది అంటూ ఎన్టీఆర్ స్పీకర్ కు రాసియాన్ లెక్కగను బయటపెట్టారు.
అందులో చంద్రబాబు పేరుతో పాటు అశోక్ గజపపతిరాజు ఇంకొక నలుగురు వ్యక్తుల పేర్లను ఉంచి వారిని టీడీపీ శాసన సభ సభ్యత్వం నుండి తొలగిలిస్తున్నట్టు తెలిపారు ఎన్టీఆర్. ఈ ఎలక్షను చూపుతూ రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంటగలిపిన అశోక్ గజపతిరాజుగారు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్థంతిరోజున కొనియాడ్డం, ఒక వ్యక్తిని హత్యచేసిన హంతకుడు, అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చినట్టుగా ఉంది అంటూ భారీ కౌంటర్ వేశారు. గతంలో సంచయిత బాబాయి మీద విరుచుకుపడిన ఈస్థాయిలో విమర్శలు గుప్పించడం మాత్రం ఇదే తొలిసారి. ఈ వ్యాఖ్యలు ఆయనకు,తెలుగుదేశం పార్టీకి గట్టిగానే తగిలాయి. ఆమె వ్యాఖ్యలకు రకరకాలుగా సమాధానం ఇస్తున్నారు టీడీపీ అభిమానులు.