Sampoornesh Babu: చిన్నారి ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం చేసిన సంపూర్ణేశ్‌ బాబు… ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Sampoornesh Babu: తెలుగులో తక్కువ సినిమాలే చేసినా సంపూర్ణేశ్‌ బాబుకు మంచి నటుడి పేరున్న సంగతి అందరికీ తెలిసిందే. హృదయ కాలేయం సినిమాతో వెండితెరపై హీరోగా పరిచయమైన సంపూర్ణేశ్‌ బాబు.. మొదటి సినిమాతోనే సక్సెస్‌ను అందుకున్నారు. కొబ్బరి మట్ట సినిమా కూడా మంచి టాక్‌తో హిట్ అయ్యింది. చిన్నప్పటినుంచే సినిమాపై ఇష్టం ఉండడంతో.. కెరీర్‌ను ఆ దిశగా మళ్లించాలనుకున్నాడు సంపూర్ణేశ్‌ బాబు. మహాత్మ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఆయన మెల్లమెల్లగా సినిమా ఆఫర్లను సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇకపోతే బిగ్‌బాస్‌ షోకు వెళ్లిన సంపూర్ణేశ్‌ బాబు, అక్కడి వాతావరణం నచ్చకపోవడంతో మధ్యలోనే రావడం అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది. ఇదిలా ఉండగా ఒకవైపు సినిమాల్లో నటిస్తూ తన టాలెంట్‌ను నిరూపించుకుంటూనే, సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఓ చిన్నారి ఆపరేషన్‌కు సాయం చేసి సంపూర్ణేశ్‌ బాబు వార్తల్లో నిలిచారు.

తెలంగాణలోని రామన్నపేటకు చెందిన రమేశ్, లావణ్య దంపతుల రెండు వయసున్న బాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. చిన్నారి ఆపరేషన్‌ కోసం సంపూర్ణేశ్‌ బాబు 25వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ విషయం తెలిసుకున్న నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తనకు వచ్చే రెమ్యునరేషన్‌లో కొంత భాగాన్ని ఇలా సేవా కార్యక్రమాల కోసం వెచ్చించడం చెప్పుకోదగిన విషయం. టాలీవుడ్ సినిమా హీరోలు సినిమాల్లోనే కాదు.. బయట కూడా హీరోలే అని ఇలాంటి సంఘటనలు చూసినపుడే తెలుస్తుంది. ఇంత మంచి మనసున్న సంపూర్ణేశ్‌ బాబు వరుస సినిమాలతో బిజీ కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.