రజిని సినిమాకి మళ్లీ అదే రివ్యూస్..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “పెద్దన్న”. తమిళ స్టార్ దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రం అటు తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా ఈరోజు దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది. అయితే రజినీ క్రేజ్ బానే ఉన్నా లాస్ట్ సినిమాలు తన మార్కెట్ ని బాగా దెబ్బ తీసేసాయి. మరి వీటి ఎఫెక్ట్ ఇంకా పెద్దన్న సినిమా పై కూడా పడినట్లు ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగులో అయితే ఈ సినమకి గత సినిమాల్లానే డల్ రివ్యూస్ వస్తున్నాయి. ఇంకా ఆడియెన్స్ కూడా సినిమా థియేటర్స్ వరకు పెద్దగా రావడం లేదని కూడా తెలుస్తోంది. మరి ఫైనల్ గా సినిమా ఎక్కడ నిలుస్తోంది చూడాలి. ఇక ఈ సినిమాలో నయన్ తార హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్, మీనా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే డి ఇమాన్ సంగీతం అందించిన ఈ సినిమాని సన్ పిక్చర్స్ వాళ్ళు నిర్మాణం వహించారు.