Samantha: నటిగా ఆ క్షణం నరకం అనుభవించాను… బాధను మొత్తం బయటపెట్టిన సమంత!

Samantha: సినీనటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం తెలుగు తమిళ భాష చిత్రాలలో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఇక సినీ నటుడు నాగచైతన్యను ప్రేమించడం పెళ్లి చేసుకోవడం కొన్ని కారణాలవల్ల అతనితో విడాకులు తీసుకొని విడిపోవడం కూడా జరిగింది.

విడాకుల సమయంలో సమంత గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించిన సమంత అన్నింటిని చాలా మౌనంగా భరించింది. అయితే ఆ సమయంలో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సమంత అనారోగ్య సమస్యలకు కూడా గురి అయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా ఈమె సినిమా ఇండస్ట్రీకి కూడా దూరం కావలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా సమంత సినిమా ఇండస్ట్రీకి కొంతకాలం పాటు దూరంగా ఉండి తిరిగి ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం నిర్మాణ సంస్థను ప్రారంభించి తన నిర్మాణ సంస్థలో శుభం అనే సినిమాని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఇకపోతే ఇటీవల కాలంలో తన తండ్రి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే తన తండ్రి అంత్యక్రియల సమయంలో చెన్నై వెళ్ళినప్పుడు అక్కడికి కొంతమంది అభిమానులు నాతో సెల్ఫీ దిగడం కోసం వచ్చారు. నేను తండ్రి మరణంతో భరించలేని బాధను మనసులో దాచుకొని అభిమానులు వచ్చి సెల్ఫీ అడిగితే నవ్వుతూ వారితో ఫోటోలు దిగాను. ఆ క్షణం నటిగా నేను ఎంతో నరకం అనుభవించానని ఈమె తెలిపారు.

ఇక అభిమానుల కారణంగానే నేను నేడు ఈ స్థాయిలో ఉన్నాను. నా విజయానికి కారణం నా అభిమానులే అలాంటి అభిమానుల కోసం నా బాధను మొత్తం దిగమింగుకొని పైకి నవ్వుతూ కనిపించాను అంటూ ఈ సందర్భంగా సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.