Samantha: కడపలో సందడి చేసిన సమంత.. చుక్కలు చూపించిన అభిమానులు!

Samantha: విడాకుల ప్రకటన తర్వాత సమంత ఒక్కక్షణం కూడా తీరిక లేకుండా వరుసగా సినిమాలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలకు ఐటమ్ సాంగులకు గ్రీన్ సిగ్నలిచ్చిన సమంత ఏకంగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ 2 చేతులా డబ్బులు సంపాదిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ కడపలో సందడి చేశారు. కడప జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొత్తగా నిర్మించిన మాంగల్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా వచ్చారు.

ఈ క్రమంలోనే సమంత షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తుందని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఇలా సమంత అక్కడకు రాగానే అభిమానులు పెద్ద ఎత్తున ఆమెను చుట్టుముట్టి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు. చుట్టూ బౌన్సర్ ఉన్నప్పటికీ వారిని తోసుకొని అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. అభిమానులను కంట్రోల్ చేయడానికి షాపింగ్ మాల్ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అభిమానులు మాత్రం సమంతకు ఒక్కక్షణం చుక్కలు చూపించారని చెప్పవచ్చు.

ఇలా అభిమానులు అందరూ ఒక్కసారిగా తనను ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఏ మాత్రం సహనం కోల్పోకుండా అందరికీ అభివాదం చేస్తూ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేశారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం ఆమె అభిమానులకు అభివాదం చేస్తూ తిరుగు పయనమయ్యారు. అయితే కొంతమేర ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇక విడాకులు తరువాత సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది తాజాగా యశోద అనే సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.