Samantha: సినీనటి సమంత నాగచైతన్య జీవితం గురించి అందరికీ తెరిచిన పుస్తకమే. వీరిద్దరి సినీ, వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఇక సమంత నాగచైతన్య ప్రేమలో పడటం వారి ప్రేమ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు అయితే వీరిద్దరూ కలిసి ఒకే విధమైనటువంటి టాటూలు వేయించుకోవడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు బయటకు వచ్చాయి. ఇలా వీరి రిలేషన్ గురించి వార్తలు వచ్చిన తరుణంలోనే ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
ఇలా సమంత నాగచైతన్య పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా గడిపారు. ఎంతోమందికి ఇద్దరు ఆదర్శ దంపతులకు నిలిచారు అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరు మధ్య బేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా విడాకులు తర్వాత సమంత నాగచైతన్య అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా వీరిద్దరూ తిరిగి కలసిపోతే బాగుంటుంది అంటూ కామెంట్లో చేశారు.
ఇక సమంత నుంచి నాగచైతన్య విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డారు ఇటీవల శోభిత నాగచైతన్యల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇలా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగచైతన్య తన జీవితంలో నుంచి తొలగిపోయిన తర్వాత సమంత తన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపేస్తున్నారు.
ఇకపోతే తాజాగా సమంత తన చేతిపై ఉన్నటువంటి టాటుని కూడా చెరిపేసే ప్రయత్నం చేశారు. కానీ ఈమె చేతిపై ఉన్న టాటు పూర్తిగా తొలగిపోలేదు. అయితే సమంత ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా దయచేసి మళ్లీ ప్రేమలో పడి ఇలా టాటూలు వేయించుకోవద్దంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.