‘బాహుబలి’ ఆఫర్ వద్దనుకున్న సమంత ?

Samantha refuses Baahubali offer
Samantha refuses Baahubali offer
సమంత స్టార్ హీరోల సినిమాలకు సైన్ చేయడం ఎప్పుడో మానేసింది.  లేడీ ఓరియెంటెడ్ కథలే చేస్తోంది.  పాత్రకు ప్రాధాన్యం ఉంటే వెబ్ సిరీస్ కూడ చేస్తోంది.  ఇటీవల ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ సిరీస్ మంచి హిట్ అయింది.  అందులో సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి.  జాతీయా స్థాయిలో ఆమె పేరు చర్చకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ మూలంగా ఆమె ఫేమ్ రెట్టింపు అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు పెరిగాయి. భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న చాలామంది ఆమెను అప్రోచ్ అవుతున్నారు.  అయితే వాటిలో కొన్నింటిని సమంత రిజెక్ట్ చేయడం జరిగిందట. 
 
అలా ఆమె రిజెక్ట్ చేసిన వాటిలో బాహుబలి ఆఫర్ కూడ ఉందని టాక్.  బాహుబలి విజయం సాధించిన తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ‘బాహుబలి-బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు.  ఇది పూర్తిగా శివగామి పాత్ర తాలూకు కథ.  ఆమె బాల్యం, ఎదుగుదల, రాజ్యానికి రాణి కావడం లాంటి అంశాలు అందులో ఉంటాయి. ముందుగా దీన్ని ప్రవీణ్ సత్తారు, దేవ కట్ట డైరెక్ట్ చేస్తారని ఒప్పందం కుదిరింది. కానీ ఇప్పుడు వాళ్ళు తప్పుకున్నారు. వేరే దర్శకులతో కొత్త నటీనటులతో వెళ్లాలని నెట్ ఫ్లిక్స్ భావించిందట. ఆ ప్రయత్నంలో భాగంగానే వారు సమంతను సంప్రదించడం జరిగిందట. కానీ సమంత మాత్రం ఆ అవకాశాన్ని కాదన్నట్టు చెబుతున్నారు. మరి నిజంగానే సమంత నో చెప్పి ఉంటే అందుకు కారణం ఏమై ఉంటుంది అనేదే ఆసక్తిగా మారింది.