Samantha-Rashmika: రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఈ పేరు అన్ని సినిమా ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. రష్మిక నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వడం వల్ల ఈమెకు వరుసగా చాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా రష్మిక హీరోయిన్ గా నటించిన పుష్ప సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రష్మిక వైవిధ్యమైన పాత్రలో నటించి తన నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది.
తాజాగా రష్మిక గురించి ఒక వార్త సినిమా ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. రష్మిక లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. పైగా రష్మిక ఈ సినిమాలో నటించడానికి సమంత కారణమని వినిపిస్తున్నాయి . రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు-2 సినిమా అంత విజయాన్ని సాధించలేక పోయినప్పటికీ.. ప్రస్తుతం తను ఒక లేడీ ఓరియెంటెడ్ కథతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా సెట్ అవుతుందని , సమంత రష్మికను కన్విన్స్ చేసి ఈ సినిమా చేయటానికి ఒప్పించిందని వినికిడి . ఇప్పటి వరకు హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించిన రష్మిక , లేడి ఓరియంటెడ్ పాత్రలో నటించలేదు.
రాహుల్ రవీంద్రకి హీరోగా మంచి గుర్తింపు లేనప్పటికీ దర్శకుడిగా ఆయన సత్తా చాటుతున్నారు. మొదట లేడి ఓరియెంటెడ్ కథ సమంతకు వినిపించగా ఆమె ఈ సినిమా కోసం రష్మికను ప్రపోజ్ చేసి తనను కన్విన్స్ చేసింది. అయితే ఈ సినిమా ఒక వైవిధ్యమైన కథతో రూపు దిద్దుకుంటోంది .దివంగత మాజీ పీఎం పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేపట్టిన సమయంలో కిరాణా కొట్టు పెట్టుకున్న యువతి ఎన్నో సమస్యలను ఎదుర్కొని అతి తక్కువ సమయంలో మంచి బిజినెస్ ఉమెన్ గా ఎదిగింది. ఆమె జీవిత కథనే ఈ సినిమా స్టోరీ. ఎక్కువ అవకాశాలు లేని రాహుల్ రవీంద్రన్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందో లేదో చూడాలి మరి. ఈ సినిమా హిట్ అయితే రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది అనటంలో సందేహం లేదు.