Samantha-Kajal: అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు . లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది . కాజల్ తన అందం అభినయంతో ప్రేక్షకులను అలరించింది. అయితే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేసిన పోస్ట్ పై సమంత కామెంట్ చేసింది .
కాజల్ అగర్వాల్ , గౌతమ్ కిచ్లూ 2020 సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కాజల్ సినిమాలను తగ్గించి భర్తతో ఎక్కువ సమయాన్ని గడుపుతోంది . తాజాగా ఈ జంట వారి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు. గత కొన్ని రోజులుగా కాజల్ అగర్వాల్ తల్లి కాబోతోందనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి , వాటన్నింటికి పుల్ స్టాప్ పెడుతూ కాజల్ భర్త గౌతమ్ కిచ్లు న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ కాజల్ ప్రెగ్నెన్సీ పై క్లారిటీ ఇచ్చారు .2022 సంవత్సరం వారికి చాలా ప్రత్యేకమని చెబుతూ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎమోజి పోస్ట్ చేశాడు.
అయితే తాజాగా కాజల్ అగర్వాల్ కూడా తన ప్రెగ్నెన్సీ పై స్పందించింది.” ఈ ఏడాది నా చిన్నారిని కలవడానికి చాలా సంతోషిస్తున్నాను. ప్రెగా న్యూస్ ఈ విషయాన్ని ఖచ్చితంగా, వేగవంతంగా నాకు తెలియజేసింది . నేను నేను దీన్ని ఎందుకు ఎంచుకున్నానో తెలియజేయటానికి ఈ కింది వీడియోలో చూడండి అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. కాజల్ పోస్టుకు సమంత స్పందిస్తూ ..‘ఓ.. క్యూట్.. నువ్వు చాలా మెరిసిపోతున్నావు… లాట్స్ ఆఫ్ లవ్ కాజల్ .. నాకు చాలా ఎగ్జైటింగా ఉంది’ అని కామెంట్ పెట్టింది. కాజల్ పోస్ట్ కు లావణ్య త్రిపాటి , నిషా అగర్వాల్ స్పందిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు .