రవితేజ డెడికేషన్ కి దణ్ణం పెట్టాల్సిందే..ఎన్ని సినిమాలు గురూ

టాలీవుడ్ మాస్ అనే పదానికి కేరాఫ్ అడ్రెస్ గా తన పేరుకే ట్యాగ్ లా మార్చేసుకున్న ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజ్ రవితేజ. అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఏది అన్ని వర్గాల ఆడియెన్స్ ని అలరిస్తూ ప్రేమను అందుకున్నాడు రవితేజ. అయితే తన కెరీర్ లో సాలిడ్ హిట్స్ ఉన్నా మధ్య అసలు టైం బాగాలేదు.

ప్లాప్ మీద ప్లాప్ పడింది. కానీ ఎట్టకేలకు క్రాక్ తో బౌన్స్ బ్యాక్ అయ్యిన రవితేజ జస్ట్ ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా నాలుగు సినిమాలు ఓకే చెయ్యడం చెయ్యడం పైగా వాటిలో మూడు సినిమాలకు ఏకకాలంలో నటించడం జరుగుతుంది. అయితే నాలుగో సినిమా ఈరోజే అనౌన్స్ అయ్యింది.

రవితేజ కెరీర్ లో 70వ సినిమాగా ఇది ప్రకటితం అయ్యింది. అలాగే దీనిపై డీటెయిల్స్ రేపు తెలియజేస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఏడాదిలోనే నాలుగు సినిమాలు చేస్తున్న మాస్ మహారాజ్ డెడికేషన్ కి నిజంగా దణ్ణం పెట్టొచ్చు. మరి అవన్నీ కూడా హిట్స్ అయ్యి రవితేజ అందరినీ మరింత ఎంటర్టైన్ చెయ్యాలని ఆశిద్దాం.