Salt: అన్నంలోకి ఉప్పు వేస్తే అప్పులపాలవుతారా.. జ్యోతిష్యులు ఏం చెప్తున్నారు?

Salt: సాధారణంగా ప్రతి ఒక్కరు ఎన్నో మూఢనమ్మకాలను నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్నిరకాల పనులు చేయాలంటే లేదా ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలన్న ఎన్నో సందేహాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్మేవారు మనం ప్రతిరోజు తయారు చేసుకుని తినే అన్నంలో ఉప్పు వేయకూడదని చెబుతుంటారు. ఈ విషయం గురించి చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు.వాస్తు శాస్త్రం ప్రకారం అన్నంలోకి ఉప్పు వేస్తే మనకు అప్పులపాలు అవుతాయని అందుకోసమే అన్నంలోకి ఉప్పు వేసుకోకుండా తినాలని చాలా మంది చెబుతుంటారు.

మరికొందరు అన్నం లేని ఉప్పు తినాలంటే వారికి సహించదు కనుక అన్నంలోకి ఉప్పు వేసుకుని తింటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం జ్యోతిష్యుల ప్రకారం మనం అన్నంలోకి ఉప్పు వేసుకుని తింటే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. సాధారణంగా అన్నం తయారు చేసేటప్పుడు అన్నంలోకి ఉప్పు వేయకూడదని చాలామంది చెబుతుంటారు. ఆధ్యాత్మిక పరంగా అయితే ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక ఉప్పును అలా వేసి చేయడం వల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని అందుకోసమే అన్నంలోకి ఉప్పు వేయకూడదని చెబుతారు.

ఇక ఆరోగ్యపరంగా అయితే ప్రతి ఒక్క వంటకంలోకి అధికంగా ఉప్పు వాడటం వల్ల రక్తపోటు వచ్చే సమస్య ఉంటుంది. అందువల్ల ఉప్పు తగ్గించుకోవడానికి ఈ విధమైనటువంటి కారణాలు చెప్పడం వల్ల చాలామంది అన్నంలోకి ఉప్పు వేయకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే వారు అవుతారని అందుకోసమే అన్నంలోకి ఉప్పు వేయకూడదని చెబుతారు. అయితే ఉప్పు వేయడం వేసుకోవడం అనేది మన ఇష్టం మనకు ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోతే నిరభ్యంతరంగా అన్నంలోకి ఉప్పు వేసుకోవచ్చని చెప్పవచ్చు.