Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ, బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. అయితే సల్మాన్ గత కొన్ని సంవత్సరాలుగా బిగ్ బాస్ షోకి హోస్ట్ వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తన రెమ్యునరేషన్ లను కూడా బాగా పెంచుకుంటూ పోతున్నాడు సల్మాన్ ఖాన్. సాధారణంగా ఈ బిగ్ బాస్ షో మూడు నెలల పాటు కొనసాగుతూ ఉంటుంది.
అయితే హిందీలో ఇప్పటికే దాదాపు 18 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే 19వ సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని కోసం సల్మాన్ ఖాన్ ఈ నెలాఖరు నాటికి ప్రోమో షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ 18 వ సీజన్ కోస రూ. 250 కోట్లు అందుకున్నాడు సల్మాన్. అయితే ఈ సారి బిగ్ బాస్ షో రన్నింగ్ టైమ్ పెరగడంతో తన రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు. బిగ్ బాస్ 19వ సీజన్ కోసం సల్మాన్ దాదాపు రూ. 300 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
బిగ్ బాస్ కోసం ప్రతి సంవత్సరం మూడు నుంచి నాలుగు నెలలు షూటింగ్ లో పాల్గొంటాడు సల్మాన్. కానీ ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు సల్మాన్ నుండి మరిన్ని ఎక్కువ రోజుల డేట్స్ అడుగుతున్నారు. అందుకే ఈ కండల వీరుడు తన పారితోషికాన్ని కూడా భారీగా పెంచినట్లు తెలుస్తోంది. కేవలం వంద రోజులకి 300 కోట్ల వామ్మో అంటూ షాక్ అవుతున్నారు అభిమానులు. ఈ విషయంలో నిజానిజాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.