సల్మాన్ ఖాన్ ‘రాధే’.. ఇలాంటి సినిమా ఎప్పుడూ రాలేదంటున్నారు

Salman Khan fans upset with Radhe movie
Salman Khan fans upset with Radhe movie
 
లాక్ డౌన్ దెబ్బకు దేశంలోని థియేటర్లన్నీ పూర్తిగా మూతబడిన వేళ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ నిన్న ఓటీటీల ద్వారా విడుదలైంది.  ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  సినిమా మీదున్న క్రేజ్ మూలంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సైతం కాసేపు క్రాష్ అయింది.  ఇంతటి భారీ అంచనాలను సల్మాన్ ఖాన్ చిత్రం ఎంతవరకు అనుకోగలిగింది అంటే అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు.  సల్మాన్ సినిమా అంటే మ్యాజిక్ అంతా ఆయన పాత్రలోనే ఉంటుంది.  భాయ్ చేసే ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ కోసమే సినిమా చూస్తారు అభిమానులు.  కథ, కథనం ఒక మాదిరిగా ఉన్నా భాయ్ నటన సినిమాను నిలబెట్టేస్తుంది.  అదే ఈ ‘రాధే’లో మిస్సయింది.  
 
అభిమానులు ఆశించిన భాయ్ మచ్చుకు కూడ కనబడలేదు.  దర్శకుడు ప్రభుదేవా సల్మాన్ పాత్రను ఆకర్షణీయంగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎప్పుడో దశాబ్దం క్రితం వచ్చి పోయిన కథను తీడుకొచ్చి సినిమా చేశాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కథనంలో బలం లేకపోవడం, సల్మాన్ స్థాయి ఎలివేషన్స్ కరువవడం సినిమాకు పెద్ద లోటు. సల్మాన్ పోలీస్ పాత్రలో కనిపించే ఏ సినిమా తీసుకున్నా అందులో విలన్ క్యారెక్టర్ ఎంతో బలంగా ఉంటుంది.  అలా ఉన్నప్పుడే సల్మాన్ ఖాన్ హీరోయిజం తారా స్థాయిలో పండుతుంది.  కానీ ‘రాధే’లో ఆ విలన్ పాత్ర డమ్మీ కావడంతో హీరో ఎలివేట్ కాలేకపోయాడు.  
 
ఇక సల్మాన్ మార్క్ ఉస్తాద్ యాటిట్యూడ్ డైలాగ్స్ కరువయ్యాయి సినిమాలో.  దీంతో జనరల్ ఆడియన్స్ సైతం నితుత్సాహానికి గురుకావాల్సి వచ్చింది.  ఒక్క మాటలో చెప్పాలంటే ‘రాధే’ లాంటి నాసిరకం సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్లో ఎప్పుడూ రాలేదని డిసప్పాయింట్ అవుతున్నారు ఆయన అభిమానులు.