Radhe Shyam : తమ మోస్ట్ వైలెంట్ మెన్ “రాధే శ్యామ్” కి అదిరే విషెష్ తెలిపిన నిర్మాతలు!

Radhe Shyam : పాన్ ఇండియాస్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “రాధే శ్యామ్” తాలూకా హవా ఇపుడు ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తుంది. చాలా కాలం అనంతరం ఈ భారీ సినిమా విడుదల కానుండడంతో ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఓ రేంజ్ హైప్ నెలకొంది.
మరి ఈ సినిమా రిలీజ్ సందర్భంగా అనేక మంది సినీ ప్రముఖులు తమ బెస్ట్ విషెష్ తెలుపుతుండగా రానున్న ప్రభాస్ తో మరిన్ని భారీ సినిమాలు చేస్తున్న దర్శకులు నిర్మాతలు కూడా అదిరే విషెష్ ని తెలియజేస్తున్నారు.
అలా ప్రభాస్ కెరీర్ లోనే ఒక భారీ మాస్ సినిమా అయినటువంటి “సలార్” అనే తీస్తున్న కన్నడ ఇండస్ట్రీ నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నుంచి తమ మోస్ట్ వైలెంట్ మెన్ పై ఓ రేంజ్ ఎలివేషన్ ఇస్తూ విషెష్ తెలిపారు. రాధే శ్యామ్ చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నామని.
ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని ఉన్నత శిఖరాలు అందుకోవాలని అనుకుంటున్నామని. ఇక మా తిరుగులేని శక్తి ట్రయిల్ బ్లేజర్ అయినటువంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి స్పెషల్ మెన్షన్ ఇస్తున్నామని తన స్టెల్లార్ పెర్ఫామెన్స్ తో అదరగొడతాడని తనకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. దీనితో ఈ భారీ సినిమా పేరు ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.
https://twitter.com/hombalefilms/status/1502145508395028481?s=20&t=K6YTO2-GOGaMXR0TgjNsjw