Sakshi Agarwal: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కింది. సదరు హీరోయిన్ తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? వరుడు ఎవరు అన్న విషయానికి వస్తే.. తాజాగా ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన నవనీత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది సాక్షి అగర్వాల్. దాంతో నూతన వధువు వరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. ఈ దంపతులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇకపోతే సాక్షి విషయానికొస్తే..కాగా సాక్షి అగర్వాల్ చాలా సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అలాగే కొన్ని కొన్ని సినిమాలలో సహాయ పాత్రల్లో నటించింది. మెయిన్ హీరోయిన్ గా కూడా నటించి మెప్పించింది. అంతకుముందు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి బాగా పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ.
అయితే సాక్షి, నవనీత్ వివాహం గోవాలోని ఒక స్టార్ హోటల్ లో జరిగినట్లు తెలుస్తోంది. తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ మిశ్రా ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ పెళ్లి ఫోటోలో నువ్వు షేర్ చేస్తూ సాక్షి అగర్వాల్ ఈ విధంగా రాసుకొచ్చింది..నవనీత్‌ని పెళ్లి చేసుకోవడం ఒక కల. అది నిజమైంది. అతను ఎప్పుడూ నాకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి. కలిసి పెరిగిన మేమిద్దరం ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించబోతున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త అధ్యాయం కోసం మేము ఎదురుచూస్తున్నాము అని రాసుకొచ్చింది.