సాయి పల్లవి ఈ సారి మెగా ఛాన్స్ మిస్సవ్వట్లేదట.!

Sai Pallavi This Time No Escape For Sure | Telugu Rajyam

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ దాదాపు పూర్తి కావస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోలా శంకర్’ సినిమా ఆన్ సెట్స్ ఉంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే, మలయాళ రీమేక్ ‘లూసిఫర్’ కూడా లైన్‌లోనే ఉంది. వీటితో పాటు, మరిన్ని ప్రాజెక్టులు చిరంజీవి సెట్ చేస్తున్నారు.

కాగా, ‘భోలా శంకర్’ సినిమాలో కీర్తి సురేష్ రోల్ కోసం మొదట సాయి పల్లవిని అనుకున్న సంగతి తెలిసిందే. ఆమె తిరస్కరించిందన్న వార్తలు కూడా తెలిసినవే. ఈ తిరస్కరణ ఇష్యూకి సంబంధించి చిరంజీవి, ‘లవ్ స్టోరీ’ సినిమా ఫంక్షన్‌లో క్లారిటీ ఇచ్చేశారు. దాంతో పాటు, సాయి పల్లవికి తన సినిమాలో ఆఫర్ ఇస్తానంటూ మాట కూడా ఇచ్చేశారు.

చిరంజీవి తన మాట నిలబెట్టుకునే సమయం ఆసన్నమైనట్టే ఉంది. ఏ సినిమా అనేది తెలీదు కానీ, చిరంజీవి ఫ్యూచర్ ప్రాజెక్టులో సాయి పల్లవి ఛాన్స్ కొట్టేసిందట. అయితే, పూర్తి స్థాయి హీరోయిన్‌గా కాదట. ఒక పాట, రెండు, మూడు కీలక సన్నివేశాలు చిరంజీవి, సాయి పల్లవిపై చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారట. ఏంటా ప్రాజెక్టు.? ఏమా కథ.? అనేది త్వరలోనే వెల్లడి కానుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles