ఆ హీరో పోస్టర్స్ భద్రంగా దాచుకున్న సాయి పల్లవి.. ఆయనంటే అంత ఇష్టమా..?

ఫిదా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాయి పల్లవి డాన్సర్ గా కూడా అందరికీ సుపరిచితమే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాలో సాయి పల్లవి నటనకు అందరూ ఫిదా అయిపోయారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను చేస్తూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటున్న సాయిపల్లవికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. హీరోయిన్ లు అందరూ గ్లామరస్ గా కనిపించడానికి సర్జరీలు చేయించుకుంటున్న ఈ రోజుల్లో సాయి పల్లవి మాత్రం తన నాచురల్ బ్యూటీతో అందరినీ ఆకట్టుకుంది.

ఇటీవల సాయిపల్లవి నటించిన సినిమా విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె నటించిన విరాట పర్వం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇటీవల సాయి పల్లవి గురించి ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి ఈ రూమర్లకు చెక్ పెడుతూ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించింది. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి సినిమాని ప్రకటించింది . గార్గి అనే పేరుతొ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లో నటించనుంది. ఈ సినిమా కూడా డిఫెరెంట్ జోనర్ లో ఉండబోతోంది.

ఇదిలా ఉండగా ఇటీవల సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో సాయి పల్లవి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మీకు ఇష్టమైన హీరో ఎవరు అని యాంకర్ అడగగా.. సాయి పల్లవి స్పందిస్తూ..కమల్ హాసన్, సూర్య, మమ్ముట్టి ఈ ముగ్గురూ చాలా ఇష్టం అని తెలిపింది. అయితే ఈ ముగ్గురిలో కమల్ హాసన్ అంటే మరింత ఎక్కువ ఇష్టం . కమల్ హాసన్ నటించిన సినిమా పోస్టర్లు పేపర్ లో వస్తే వాటిని జాగ్రత్తగా కత్తిరించి బుక్స్ లో దాచునేదాన్ని. ఇప్పటికి వాటిని చాలా భద్రంగా దాచుకున్నా అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.