అలా పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదంటూ తేల్చి చెప్పిన సాయి పల్లవి..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో అందాల నటి సాయి పల్లవి కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫిదా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం సాయిపల్లవి నటించిన విరాట పర్వం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దగ్గుబాటి రానా, సాయి పల్లవి కలిసి నటించారు.

నక్సలిజం నేపథ్యంలో జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా యూనిట్ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఈ క్రమంలో సాయి పల్లవి కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా సక్సెస్ అవ్వటానికి తన వంతు కృషి చేస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు గురించి స్పందించింది.

సాయి పల్లవికి లేడి సూపర్ స్టార్ అన్న బిరుదు డైరక్టర్ సుకుమార్ గారు ఇచ్చారు. ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సుకుమార్ సాయి పల్లవిని లేడి సూపర్ స్టార్ అంటూ సంబోదించాడు.దీంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇటీవల సాయి పల్లవి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నాకు అల ఎవరైనా పిలిస్తే కొంచం అతిగా అనిపిస్తుంది. అలా పిలిపించుకోవటం నాకు అసలు ఇష్టం లేదు. నేనిక్కడ అందరితో సమానంగా ,గౌరవంగా పనిచేయడానికి వచ్చాను. అంతే కానీ స్టార్ డమ్ చూసి వచ్చే వాళ్ళ కోసం కాదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఆమె మీద మరింత గౌరవం పెరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.