టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ సాయి పల్లవి నటిగా, వ్యక్తిగతంగా మంచి పేరు సంపాదించుకుంది. అంతే కాకుండా తెలుగురాష్ట్రాల ప్రజలను అభిమానులుగా మార్చుకుంది. ఇక ప్రస్తుతం ఆమె విరాటపర్వం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉంటే విరాటపర్వం తర్వాత కొత్త సినిమాలకు సైన్ చేయట్లేదని తెలుస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని 2023 లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని తన పెళ్లి గురించి టాపిక్ తీసింది. దీంతో ఈ అమ్మడు మొత్తానికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని అందుకే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. సాయి పల్లవి ఏమని స్పందిస్తుందో చూడాలి.