హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళం సినిమా ద్వారా హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా సాయి పల్లవి నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ , మలయాళం భాషలలో స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
సాయి పల్లవి తన మొదటి సినిమా నుండి ఇప్పటివరకు కూడా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తన నేచురల్ బ్యూటీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సాయి పల్లవి ఎప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలో నటించడానికి ఆసక్తి చూపుతోంది. ఈమె నటించిన అన్ని సినిమాలు దాదాపు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందడం అంత సులభమైన విషయం కాదు. కానీ సాయి పల్లవి మాత్రం జీవితలో గ్లామర్ పాత్రలు చేయనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి విరాటపర్వం సినిమాలో నటించింది ఈ సినిమా ఈ నెల 17 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తోంది. ఈ క్రమంలో ఆమె చెప్పిన విషయాలను విని అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. తెలుగు భాషకు బాగా అలవాటు పడిన సాయి పల్లవి ఇంట్లో కూడా తన తల్లిదండ్రులతో తెలుగులో మాట్లాడుతోంది. అందువల్ల తను తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సాయి పల్లవి టాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమలో ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. నాన్ వెజ్ అంటే ఇష్టపడని సాయి పల్లవి ప్రేమించిన వ్యక్తి కోసం ఏకంగా చికెన్ వండి పెట్టానని చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఆమె ప్రేమించిన వ్యక్తి ఒక స్టార్ హీరో అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరీ ఈ విషయంపై సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.