Sai Pallavi: సాయి పల్లవి గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది సాయి పల్లవి. అందులో భాగంగానే తాజాగా అమరన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించింది సాయి పల్లవి. అంతేకాకుండా ఈ సినిమాతో మరొక హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే ఇటీవలే సాయి పల్లవి చెల్లెలు పూజా మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ లో పూజా కన్నన్ పెళ్లి జరిగింది. ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ వినీత్ తో కలిసి ఏడడుగులు వేసింది.
ఈ వేడుకలో హీరోయిన్ కుటుంబం సంతోషంగా గడిపారు. అదే సమయంలో పెళ్లయ్యే క్షణాల్లో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అయితే తాజాగా మరోసారి ఆ వెడ్డింగ్ ఫోటోలను సాయి పల్లవి తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసింది. ఈ మేరకు ఆ ఫోటోలు షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది సాయి పల్లవి. నా చెల్లి పెళ్లి తర్వాత నా జీవితం కొత్త దశలోకి వెళ్తుందని నాకు తెలుసు. ఆ వేడుకకు వచ్చినవాళ్ల ఆశీర్వాదాలు, కన్నీళ్లు, డ్యాన్స్ ప్రతీదానికి నేను సాక్ష్యంగా నిలిచాను. పూజా వైవాహిక బంధంలో అడుగుపెట్టేందుకు మొదట నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇదంతా కొత్తగా అనిపించింది. ఇకపై నీకు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వలేను.
కానీ నా మనసులో మాత్రం వినీత్ నిన్ను నా అంతగా లేదా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తాడన్న నమ్మకం ఉంది. మీ పెళ్లయి మూడు నెలలు అవుతోంది. నేను అనుకున్నట్లుగానే తను నిన్ను ఎంతో బాగా చూసుకుంటున్నాడు. మీ జంటపై ప్రేమను కురిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చింది సాయి పల్లవి. ఇది చూసిన అభిమానులు మీ అక్కాచెల్లెళ్ల మధ్య ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు ఆ పోస్ట్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ పోస్ట్ వైరల్ గా మారింది.