విషాదం : “రాధే శ్యామ్”లో పూజా పాత్ర అలా ముగించేస్తారా.?

 
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ గా సెటిల్ అయ్యాడు. ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్” రిలీజ్ కి రెడీ అవుతుండడం మాత్రమే కాకుండా ఈ గ్యాప్ లో ఒకదాన్ని మించి ఒకటి సూపర్ అప్డేట్స్ తో చిత్ర బృందం పలకరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మ్యూజిక్ ఆల్బమ్ కాస్త స్పెషల్ అని చెప్పి తీరాలి. 
 
హిందీకి ఒక ఆల్బమ్ ని అలాగే సౌత్ ఇండియన్ వెర్షన్ కి ఒక ఆల్బమ్ ని మేకర్స్ సృష్టించారు. అయితే ఈరోజు హిందీ వెర్షన్ లో సాంగ్ ని మొదట రిలీజ్ చెయ్యగా ఇది మరిన్ని అంచనాలు పెంచేసింది. పర్ఫెక్ట్ బాలీవుడ్ సినిమా రేంజ్ లో కనిపిస్తుంది. అలాగే ప్రేరణగా పూజా హెగ్డే తో ప్రభాస్ కెమిస్ట్రీ కూడా సూపర్ గా వచ్చింది. 
 
ఇంకా మరో ఆసక్తికర విజువల్స్ ని చిత్ర యూనిట్ లాస్ట్ లో చూపించారు. దీనిని బట్టి పూజా పాత్ర కి విషాద ముగింపు తప్పేలా లేదని అనిపిస్తుంది. స్ట్రెక్చర్ పై పూజా చేతిని పట్టుకోవడం దాన్ని అలా తీసుకెళ్లడం మూవీ లవర్స్ కి హార్ట్ బ్రేక్ సన్నివేశాల్లా అనిపిస్తున్నాయి. మరి ఎంతో కీలక అయ్యిన ఈ పాత్రని దర్శకుడు రాధ ఎలా డీల్ చేసాడో చూడాలి.