వరలక్ష్మీ శరత్ కుమార్‌తో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహా మూవీస్ నిర్మిస్తున్న ‘శబరి’ విశాఖ షెడ్యూల్ పూర్తి

Sabari: టాలీవుడ్ హ్యాపెనింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘శబరి’. తాజాగా మూడో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. విశాఖలోని ఆర్కే బీచ్, సిరిపురం జంక్షన్‌తో పాటు అరకు లాంటి అందమైన లొకేషన్లలో షూటింగ్ చేశాం. అక్కడ ప్రధాన తారాగణంపై కొన్ని యాక్షన్ సీక్వెన్సులు, ఒక పాట, కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

నందు, నూర్ మాస్టర్స్ పర్యవేక్షణలో రూపొందిన ఈ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని చిత్ర బృందం తెలిపింది. నాలుగో షెడ్యూల్ ఈ నెలలో హైదరబాద్‌లో మొదలు కానుంది. దాంతో సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుంది. నవంబర్ చివరి వారంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి.

ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ కాట్జ్ మాట్లాడుతూ… “వరలక్ష్మీ శరత్ కుమార్ గారు ఎంపిక చేసుకునే చిత్రాలు భిన్నంగా ఉంటాయి. మా ‘శబరి’ కూడా అటువంటి భిన్నమైన చిత్రమే. శబరి పాత్రను నిజ జీవితంలో కూడా ధైర్యంగా ఉండే వ్యక్తి చేస్తే బాగుంటుందని అనుకుంటున్న తరుణంలో వరలక్ష్మి గారు ఈ కథ వినటం, సినిమా చేయడానికి ఒప్పుకోవడం మా అదృష్టం. ఈ చిత్రంలో స్వతంత్ర భావాలున్న యువతిగా ఆమె కనిపిస్తారు. యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా ఎఫెక్టివ్ గా పెర్ఫార్మ్ చేశారు. అన్ని హంగులున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకు వద్దామా అని ఎదురు చూస్తున్నాం” అని అన్నారు.

నటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ చిత్రంలో తారాగణం.

సాంకేతిక బృందం: ఈ చిత్రానికి రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్, మేకప్: చిత్తూరు శ్రీను, కాస్ట్యూమ్స్: అయ్యప్ప, కాస్ట్యూమ్ డిజైనర్: మానస, స్టిల్స్: ఈశ్వర్, పబ్లిసిటీ డిజైనర్: సుధీర్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి, కో- డైరెక్టర్: వంశీ, ఫైట్స్: నందు – నూర్, కొరియోగ్రాఫర్స్: సుచిత్ర చంద్రబోస్ – రాజ్ కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలాల, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపి సుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల, కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: అనిల్ కాట్జ్.