S.S Thaman: నాకు అన్నం పెట్టిన దేవుడు చక్రీ అంటూ… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్!

S.S Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ లిస్టులో ఎస్.ఎస్.తమన్ పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టి ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎస్.ఎస్ తమన్ స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బాచి సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన డైరెక్టర్ చక్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించి అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇలా పది సంవత్సరాలలో ఏకంగా వంద సినిమాలకు సంగీతం అందించి రికార్డు సృష్టించారు దివంగత చక్రి. ఈయన 2014వ సంవత్సరంలో అకాల మరణం పొందారు. ఈ క్రమంలోనే ఆయన సోదరుడు మహిత్​ నారాయణ్​ నెలకొల్పబోతున్న ‘సి-స్టూడియోస్​ (ద సోల్​ఫుల్​ మ్యూజిక్​ అడ్డ)’ లోగోను ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ ఆవిష్కరించారు.ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఎస్ఎస్ థమన్ మాట్లాడుతూ చక్రితో తనకున్న జర్నీ గురించి వెల్లడించారు.

ఇలా ఎంతో మందికి ప్రేమ ఆప్యాయతలను పంచే చక్రి గారు నేడు మనమధ్య లేకపోవడంఎంతో బాధాకరమని ఆయన దగ్గర పని చేసేటప్పుడు ఆయన ఇచ్చే డబ్బులకి కాకుండా అతని పంచే ప్రేమ కోసమే ఇక్కడికి వచ్చే వాళ్లని తమన్ తెలియజేశారు. ఆయన మనసంతా ఎంతో మంచితనంతో నిండి పోయిందని,ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను అంటే అందుకు కారణం చక్రి అని నాకు అన్నం పెట్టిన దేవుడు ఆయన అంటూ తమన్ చక్రి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన సోదరుడిగా మహిత్ నారాయణ్ స్థాపించిన స్టూడియో ని అందరూ ఆదరించాలని తనకు ఏ విధమైన ఎటువంటి సహాయం కావాలన్నా తాను తప్పకుండా చేస్తానని తమన్ ఈ సందర్భంగా వెల్లడించారు.