ఏపీ బీజేపీ కోసం ఆ బ్యాచ్ రంగంలోకి దిగుతోంది.. పరిస్థితి తలుచుకుంటే ఉలిక్కిపాటు 

భారతీయ జనతా పార్టీ పేరుకు రాజకీయ పార్టీయే అయినా దాని ఆయువు పట్టు మొత్తం ఆరెస్సెస్‌లోనే ఉంది.  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్  విధానాలు  ఎంత కఠినంగా, ఏకపక్షంగా ఉంటాయో  దేశం మొత్తానికి  తెలుసు.  బీజేపీ బలంగా ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఆరెస్సెస్ బలంగా ఉన్నట్టే లెక్క.  అంటే ఆరెస్సెస్ ఎక్కడైతే వేళ్లూనుకుని ఉంటుందో అక్కడ బీజేపీకి తిరుగుండదనేది వాస్తవం.  ఫక్తు హిందూత్వ వాదమే ఆరెస్సెస్ విధానం.  దేశంలో హిందువులదే  పైచేయిగా ఉండాలి, ముస్లింలు  చాలా సంతోషంగా ఉన్నారు అనేది ఆరెస్సెస్ ప్రస్తుత వాదన.  ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మాటకు బీజేపీలో తిరుగుండదు.  అది మోదీ అయినా అమిత్ షా అయినా విని తీరాల్సిందే.  ఎందుకంటే బీజేపీకి మూల స్థంభం  ఆరెస్సెస్‌ కాబట్టి. 

RSS chief focus on Andhrapradesh 
RSS chief focus on Andhrapradesh 

దేశం మొత్తంలో బీజేపీ పాలనలోనే ఉండాలనేది ఆరెస్సెస్ ప్రధాన లక్ష్యం.  అందుకు వారు హిందూత్వ నినాదాన్ని  ఎల్లలుదాటి వాడేస్తుంటారు.  ఈ వాడకం మూలాన  కనిపించని  కుట్రలు, వ్యవస్థలను అస్థిరపరిచే చర్యలు అనేకం జరిగాయి, జరుగుతున్నాయి.  ఎక్కడైనా అధికారానికి కొద్ధి  దూరంలోనే ఆగిపోయాం అనే భావన కలిగితే బీజేపీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసైనా సరే ప్రభుత్వాలను కూలదోసి  అధికారాన్ని చేజిక్కించుకున్న సందర్భాలు ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లో  జరిగాయి.  బీజేపీ అలా చెలరేగిపోవడానికి మెయిన్ రీజన్ ఆరెస్సెస్.  సంఘంలో క్షేత్రస్థాయి నుండి బీజాలు నాటుకుని  మహావృక్షంలా ఎదగడమే  ఆరెస్సెస్ లక్షణం.  అలా ఎదిగిన ఆ వృక్షాన్ని కూల్చడం చాలా కష్టం.

  ప్రజెంట్ ఈ మహావృక్షాన్ని ఏపీలో  పెంచాలని చూస్తోంది ఆరెస్సెస్.  దశాబ్దాల నుండి పోరాడుతున్నా బీజేపీ ఏపీలో పట్టు సాధించడంలేదు.  కారణం ఆ పార్టీ నాన్ లోకల్ అనే ఫీలింగ్ జనంలో ఉండటమే.  దాన్ని పోగొట్టాలంటే అదొక హిందూత్వ పార్టీ అని, మన పార్టీ అని జనాలు అనుకునేలా చేయాలి.  ఆలా చేయగలిగింది ఆరెస్సెస్ ఒక్కటే.  ఏపీలో కొన్ని చోట్ల ఆరెస్సెస్ విభాగాలు ఉన్నా అవేమంత  చురుగ్గా లేవు.  అందుకే ప్రతి జిల్లాలోనూ  ఆరెస్సెస్‌కు బలమైన పునాదులు వేయాలని  భావిస్తున్నారు సంఘ్ పెద్దలు.  

RSS chief focus on Andhrapradesh 
RSS chief focus on Andhrapradesh 

ఈ ప్రక్రియలో సంఘ్ నుండి ఆరితేరిన వ్యక్తులను, పలు రాష్ట్రాల్లో పనిచేసి మంచి ఫలితాలు సాధించిన సమర్థులను  రాష్ట్రంలో దించాలనే ప్రయత్నాలు  జరుగుతున్నాయట.  అదే గనుక జరిగితే పాఠశాల స్థాయి నుండి కొత్త తరంలో హిందూత్వ వాదాన్ని పెంచి పోషించడం జరుగుతుంది.  ఫలితంగా ఇన్నాళ్లు కులాల మీద నడిచిన ఆంధ్రా  రాజకీయం ఇంకో మెట్టు కిందికి  దిగేసి మతాల ప్రాతిపదికన నడిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.