RRR: రోమాలు నిక్కబొడిచేలా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ .. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం అంటూ!

RRR: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. అన్ని పనులను పూర్తిచేసుకుని వచ్చే నెల 7వ తేదీ విడుదలకు ఈ సినిమా సిద్ధమైందని చెప్పాలి. ఇకపోతే జనవరి 7వ తేదీ ఈ సినిమా విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సినిమా నుంచి వరుస అప్డేట్ లని విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా నేడు ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే 3:16 సెకండ్ నిడివి ఉన్నటువంటి ఈ ట్రైలర్ ప్రేక్షకులను సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా వారి రౌద్రం చూపించారు. ఇక ఇందులో ఎన్టీఆర్ తారక్ చెప్పే డైలాగులు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఒక్క ట్రైలర్ తో సినిమా గురించి కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన ఈ సినిమాపై మరిన్ని అంచనాలు కలిగేలా దర్శకుడు రూపొందించారు.

YouTube video player

ఇక ఈ ట్రైలర్ లో శ్రీయ, అజయ్ దేవగన్, ఆలియా, తారక్, చెర్రీ వారి నటన విశ్వరూపం చూపించారు. ట్రైలర్ లో చెప్పిన డైలాగులు ఆద్యంతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుత ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమా కోసం మరింత ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా సినిమా పై భారీ అంచనాలు పెంచాయని చెప్పవచ్చు.