Ram Charan: ఆర్ఆర్ఆర్ ఈ సినిమా సంక్రాంతికి రాకపోయినా ఎలాంటి బాధ లేదు.. షాకింగ్ కామెంట్ చేసిన రామ్ చరణ్!

Ram Charan: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా నటించిన తాజా చిత్రం రౌడీ బాయ్స్. ఇందులో ఆశిష్ పక్కన హీరోయిన్ గా అనుపమ నటిస్తోంది. ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక మ్యూజికల్ నైట్ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో రామ్చరణ్ మాట్లాడుతూ.. రౌడీ బాయ్ సినిమా లోని నాలుగు సాంగ్స్ ను రిలీజ్ చేశారని విన్నాను.

అయితే ఆ పాటలను నేను ఇంకా వినలేదు. కానీ బయట మాత్రం ఆ పాటలకు బాగానే రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆదిత్య మ్యూజిక్ వారికి కంగ్రాట్స్.. దేవి శ్రీ ప్రసాద్ ఇక్కడ లేనప్పటికీ ఆ పాటలు బాగా హిట్ అయ్యాయి అని విన్నాను అని తెలిపారు చెర్రీ. ఇక ఆశిష్ ను లాంచ్ చేయడం ఒక బిగ్ బాస్ టాస్క్ అని నాకు తెలుసు. ఈ సినిమాకి దేవి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. మధి గారితో నేను కూడా పని చేయాలని అనుకున్నాను కానీ ఆశిష్ మొదటి సినిమాకే అవకాశం దక్కింది అని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. అనంతరం దర్శకుడు హర్ష గురించి మాట్లాడుతూ.. డైరెక్టర్ హర్ష కి మంచి భవిష్యత్తు ఉంది.. హర్ష కి మంచి నిర్మాతలు దొరికారు.. ఈ సంక్రాంతి పండుగ మీదే అవుతుంది అని నేను ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చారు చరణ్.

అనంతరం రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ సంక్రాంతికి మా సినిమా రాకపోయినా మాకు బాధ లేదు.. మూడున్నర సంవత్సరాలు కష్టపడి చేసిన సినిమా కరెక్ట్ సమయంలో రావాలి.. ఇందుకు పెద్దలు ఉన్నారు వారు డిసైడ్ చేస్తారు.. సినిమాకు సంబంధించిన విషయాలు అన్నీ డి.వి.వి దానయ్య గారు, రాజమౌళి గారు చూసుకుంటారు. మాకు సంక్రాంతి ఎంత ముఖ్యమో తెలియదు కానీ.. సంక్రాంతి దిల్ రాజుని వదులుకోదు.. ఇప్పటికే దిల్ రాజు సంక్రాంతికి ఎన్నో సక్సెస్ లు చూశారు.. ఇక ఈ సంక్రాంతి కూడా వాళ్లదే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు చెర్రీ.