రాజమౌళి సినిమా అంటే ఆషామాషీ కాదు. కాస్త ఎక్కువ ఎదురుచూడాల్సిందే. అయితే సినిమాలో ఆ ఎదురుచూపులు తగ్గ ట్రీట్ ఉంటుంది. అందుకే ఆయన్నుండి రెండేళ్లకు ఒక సినిమా మాత్రమే వస్తుంది. ‘బాహుబలి -2’ తర్వాత జక్కన్న ఏ సినిమా చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరినీ కలిపి ఆర్ఆర్ఆర్ అనౌన్స్ చేశారు. దాంతో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే లాక్ డౌన్ మూలంగా సినిమా అనుకున్న తేదీ కంటే వెనక్కు వెళ్ళింది. దాదాపు ఏడాదికి పైగా ఆలస్యం అయింది.
అన్ని అడ్డంకులను తొలగించుకుని సినిమా ట్రాక్ ఎక్కింది. అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఆ తేదీ కూడ వాయిదాపడేలా ఉంది. ఎందుకంటే సినిమాకు చాలా విఎఫ్ఎక్స్ వర్క్ మిగిలి ఉండటం, రామ్ చరణ్ ‘ఆచార్య’ షూటింగ్ కోసం గ్యాప్ తీసుకోవడం, ఎన్టీఆర్ త్వరలో ఒక రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనుండటం, అలియా భట్ క్వారంటైన్లోకి వెళ్లాల్సి రావడం లాంటి కారణాలతో వాయిదాపడేలానే కనిపిస్తోంది. మరి ఆ వాయిదా ఎన్ని రోజులు ఉంటుందో.