RRR : ‘బాహుబలి’ సినిమా విషయంలో రాజమౌళి మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది. ఎవరూ ఊహించని విధంగా ఆ సినిమాని మార్కెట్ చేయగలిగారు. ఇండియన్ సినిమాగా ‘బాహుబలి’ని దేశంలో దాదాపు అన్ని సినీ పరిశ్రమలూ అక్కున చేర్చుకున్నాయి. ‘ఇది మన సినిమా’ అన్న భావన వ్యక్తం చేశాయి. మరి, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో ఏం జరుగుతోంది.?
దేశ వ్యాప్తంగా పలు ప్రముఖ నగరాల్లో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రచారం చేస్తోంది. ప్రెస్ మీట్లు వగైరా చేపట్టారు. ప్రమోషన్స్ మరింత జోరందుకున్నాయి కూడా. అయితే, గతంలోలా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఇతర సినీ పరిశ్రమలు ‘ఓన్’ చేసుకోవడంలేదు. బాలీవుడ్ సినీ జనాలు రాజమౌళి గురించి పెద్దగా మాట్లాడటంలేదు ఈసారి. ఎందుకిలా.? అసలేం జరుగుతోంది.?
ఏమోగానీ, సినిమా విడుదల నాటికి మొత్తం సిట్యుయేషన్ మారిపోతుందనీ, దేశమంతా ఓ యుఫోరియా వచ్చేస్తుందనీ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ చాలా కాన్ఫిడెంటుగా వుంది. ‘జంజీర్’ తర్వాత రామ్ చరణ్ బాలీవుడ్‌కి వెళుతున్న సినిమా ఇది. ఎన్టీయార్‌కి అయితే ఇదే తొలి సినిమా. సో, ఈ ఇద్దరికీ బోల్డంత టెన్షన్ వుంది.
కానీ, ఎవరూ టెన్షన్ బయటకు కనిపించనీయకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు. దాదాపు ఐదొందల కోట్ల దాకా చిత్ర నిర్మాణ వ్యయం అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి, అదంతా రాబట్టేదెలా.? ఈసారి నిజంగానే రాజమౌళి ముందు చాలా పెద్ద టాస్క్ వుంది. దాన్ని ఆయనెలా పూర్తి చేస్తాడో వేచి చూడాల్సిందే.