RRR : ఒకే రోజు 100 మిలియన్ క్లబ్ లో “RRR”, “భీమ్లా నాయక్”లు.. ఎలాగంటే?

RRR : వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రాల్లో పాన్ ఇండియా చిత్రాలతో పాటు నార్మల్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి వాటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కించిన సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ఒకటి కాగా మరొకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మాస్ డ్రామా “భీమ్లా నాయక్” కూడా ఒకటి.

ఈ రెండు సినిమాలు కూడా దేనికది తగ్గకుండా వచ్చే ఏడాది రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా అనూహ్యంగా ఒకే రోజు సెన్సేషనల్ 100 మిలియన్ మార్క్ ని అందుకోవడం జరిగింది. ఎలా అంటే మోస్ట్ అవైటెడ్ గా వచ్చిన “RRR” ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చెయ్యగా.

పవర్ స్టార్ భీమ్లా నాయక్ నుంచి ఎస్ ఎస్ థమన్ ఇచ్చిన ఎనర్జిటిక్ ఫస్ట్ సాంగ్ భీమ్లా నాయక్ టైటిల్ ట్రాక్ కూడా సరిగ్గా ఇదే రోజు 100 మిలియన్ వ్యూస్ ని అందుకొని ఇదొక రికార్డు ని సెట్ చేసింది. దీనితో ఈరోజే ఈ రెండు సినిమాలు కూడా 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సెట్ చేసాయి. ఇక వీటిలో రాజమౌళి సినిమా జనవరి 7న రిలీజ్ అవుతుండగా భీమ్లా నాయక్ 12న రిలీజ్ అవుతుంది.