రాజమౌళి సినిమాల్లోనే పెద్దది..”RRR” సినిమా మొత్తం నిడివి వచ్చేసింది.!

Rrr Movie Total Run Time Is Here Biggest In Rajamouli Career | Telugu Rajyam

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ఇప్పుడు శరవేగంగా ప్రమోషన్స్ ని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి ఒక్కో సాంగ్ కూడా రిలీజ్ అవుతూ మంచి రెస్పాన్స్ ని అందుకుంటున్నాయి.

అలా నిన్న ఎమోషనల్ సాంగ్ ‘జనని’ మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అయ్యి మంచి ఆదరణను అందుకుంది. అయితే ఈ అప్డేట్ తో పాటుగా అసలు ఈ సినిమా మొత్తం నిడివి ఎంత ఉంటుంది అనేది కూడా బయటకొచ్చింది. ఈ సినిమా రాజమౌళి అన్ని సినిమాల్లోకల్లా ఎక్కువ నిడివి ఈ సినిమాకి వచ్చిందట.

రఫ్ గా ఎలా కట్ చేసినా ఈ చిత్రం మొత్తం 3 గంటల 7 నిమిషాల నిడివి వచ్చిందట. అలాగే సెన్సార్ ని కూడా పూర్తి చేసుకుందట. ఈ చిత్రానికి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారట. మొత్తంగా మాత్రం రాజమౌళి నుంచి ఈ రకంగా కూడా ఓ భారీ సినిమా చూడబోతున్నాం అనమాట.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles