RRR Movie : నిజాం గడ్డపై మరో అరుదైన రికార్డుతో “RRR” వసూళ్ల ప్రకంపనలు..!

RRR Movie :  లేటెస్ట్ ఇండియన్ సినిమా దగ్గరకి వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ అయినటువంటి చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. దర్శకుడు రాజమౌళి ఇద్దరు మాస్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తీసిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ ఎన్నో ఏళ్ల తర్వాత రిలీజ్ అయ్యి భారీ హిట్ గా నిలిచింది.
అయితే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊహించని రీతిలో 1000 కోట్లకి చేరుకొని తెలుగు సినిమా ఖ్యాతిని మరి స్థాయిలో నిలబెట్టింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు రాస్తర్లో వసూళ్లు అయితే కలకలమే రేపాయి. అలాగే ఒక్క తెలుగులోనే 600 కోట్లు గ్రాస్ అందుకున్న సినిమాగా ఓ రికార్డు అందుకున్న ఈ సినిమా మరో అరుదైన ఘనత అందుకున్నట్టు తెలిసింది.
తెలుగు స్టేట్స్ లో కీలక ఏరియా అయినటువంటి నిజాం హైదరాబాద్ సిటీలో ఒక్కో సెంటర్ లో కోటి రూపాయల గ్రాస్ ని దాటినవి ఏకంగా 46 నమోదు అయ్యాయట. అలాగే వీటిలో 16 సింగిల్ స్క్రీన్స్ కూడా ఉన్నాయట. అసలు ఈ మార్క్ ఊహించనిది అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
దీనితో ఈ సినిమా ప్రకంపనలు ఏ లెవెల్లో ఉన్నాయో అర్ధం చేసుకోవాలి. మరి ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ లు అజయ్ దేవగన్ మరియు ఆలియా భట్ లు కీలక పాత్రల్లో నటించగా శ్రేయ, సముద్రఖని తదితరులు కూడా నటించారు.