RRR Movie Overcrosses : లేటెస్ట్ గా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచిన లేటెస్ట్ భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కోసం అందరికీ తెలిసిందే. ఇండియాస్ టాప్ దర్శకుడు రాజమౌళి ఇద్దరు మాస్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ విజువల్ డ్రామా మొదటి రోజే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని అందుకున్న సంగతి తెలిసిందే.
అంతే కాకుండా ఫస్ట్ వీకెండ్ కి ప్రపంచంలోనే భారీ వసూళ్లు అందుకున్న రెండో ఇండియన్ సినిమాగా ఈ సినిమా రికార్డు సెట్ చేసింది. మరి దీనితో పాటుగా ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయినా ఇంకా ప్రపంచ వ్యాప్తంగా హవా కొనసాగిస్తోంది.
“కోడా”, “ది బ్యాట్ మెన్” లాంటి భారీ హాలీవుడ్ సినిమాలకి ధీటుగా ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ లో మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాలో టాప్ 5లో ఈ చిత్రం నిలబడి సెన్సేషన్ ని నమోదు చేసింది.
దీనితో ఈ విషయాన్నీ సినిమా యూనిట్ నే స్వయంగా ప్రకటించి ప్రపంచ వ్యాప్తంగా తమ సినిమా ఎలా అదరగొడుతుందో తెలియజేసి గర్వం వ్యక్తం చేసారు.
అలాగే ఇందులో ఇంకో విశేషం ఏమిటంటే ఈ అన్ని సినిమాల్లో కూడా ట్రిపుల్ ఆర్ కే ఎక్కువ రేటింగ్ నమోదు కావడం అని చెప్పాలి. ఈ విషయంలో అయితే ఈ చిత్రం హాలీవుడ్ సినిమాల్ని దాటి నెంబర్ 1 స్థానంలో నిలబడింది. మొత్తానికి అయితే ఈ సినిమా హవా ప్రపంచ వ్యాప్తంగా ఇలా ఉంది.
https://twitter.com/RRRMovie/status/1511068368022953986?s=20&t=MDk2WQPfmD8GPlaU8EAgOg