ఓటిటిలో “RRR” ప్రకంపనలు..లేటెస్ట్ గా వరల్డ్ రికార్డు.!

టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమోళి తెరకెక్కించిన చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కోసం ఇప్పుడు మనకే కాదు ప్రపంచం అంతటికీ కూడా తెలుసు.. అయితే ఈ ఏడాదిలో మన సినిమా కన్నా కేజీఎఫ్ పెద్ద హిట్ అయ్యినా కూడా ఓటిటి లో వచ్చాక మాత్రం వార్ వన్ సైడ్ చేసేసింది ఈ చిత్రం. 

ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ నమోదు అవుతుంది. ఇందులో వరుసగా మూడు వారాలు టాప్ లో నిలిచి రికార్డు లక్షల గంటల స్ట్రీమింగ్ తో ట్రెండ్ అవ్వగా ఇప్పుడు ఈ ప్రకంపనలు మరో సంచలన రికార్డు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. 

ప్రపంచ వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటి వరకు అత్యధిక కాలం ట్రెండ్ అయ్యిన చిత్రంగా ఈ చిత్రం నిలిచినట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు అనౌన్స్ చేసి చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలియజేసారు. దీనితో ఈ చిత్రం ఖాతాలో మరో సెన్సేషనల్ రికార్డు పడినట్టు అయ్యిందని చెప్పాలి. 

ఇక ఈ చిత్రంలో ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా శ్రేయ, సముద్రఖని అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ లు కీలక పాత్రల్లో నటించగా కీరవాణి సంగీతం అందించారు. అలాగే డీవీవీ దానయ్య 500 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మాణం వహించారు.