ఓటిటిలో “RRR” రిలీజ్ పై లీక్స్ .!

RRR Movie Makers : ఈ ఏడాది రిలీజ్ అయ్యిన భారీ సినిమాల్లో 1000 కోట్లతో బాక్సాఫీస్ దగ్గర కలకలం రేపిన మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR). దర్శకుడు రాజమౌళి రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోస్ తో చేసిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ రికార్డులు తిరగరాసి దుమ్ము లేపింది.
ఇంకా మన తెలుగు నుంచే కనీ వినీ ఎరుగని రీతూ రన్ ని కనబరిచి సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే ఈ భారీ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి నెల రోజులు దాటేసింది అయినా ఉన్న కొన్ని చోట్ల కూడా థియేటర్స్ లో బాగానే వసూళ్లు రాబడుతుంది.
ఇక థియేటర్స్ లో ఆల్ మోస్ట్ లాస్ట్ కి చేరుకున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై ఇపుడు స్వయంగా చిత్ర యూనిట్ నుంచే లీక్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. దీనితో త్వరలోనే ఈ భారీ సినిమా ఓటిటి లో వచేస్తున్నట్టు అర్ధం అవుతుంది. లేటెస్ట్ గా ఓ సోషల్ మీడియా ఫాలోవర్స్ కి చిత్ర హ్యాండిల్ రిప్లై ఇస్తూ..
సినిమాకి థియేటర్స్ లో లాస్ట్ రోజులు దగ్గరకి వచ్చేశాయని చూసి ఎంజాయ్ చెయ్యండి అని తెలిపారు. దీనితో అందరికీ ఇప్పుడు ఒక అంచనా వచ్చేసింది. మరి ఈ భారీ సినిమా ఓటిటి లో ఎప్పుడు వస్తుందో చూడాలి. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 వారు కొనుగోలు చేశారు.
https://twitter.com/RRRMovie/status/1519850629782700032?s=20&t=phQRLCwKC0IrQPnE_XKUuA