RRR Movie : “RRR” అసలు వేట ఇప్పుడు నుంచి అట.. అదెలాగో చూడండి.!

RRR Movie :  ఇండియన్ సినిమా దగ్గర అలాగే మన తెలుగు సినిమా దగ్గర కూడా బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ కష్టమే ఏమో అని చాలా మంది అభిప్రాయ పడ్డారు.
కానీ అది తప్పు అని నిరూపిస్తూ పాన్ ఇండియా సినిమా దగ్గర గర్జిస్తున్న లేటెస్ట్ మరో సినిమా ట్రిపుల్ ఆర్(RRR).
దర్శకుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా తెరక్కించిన ఈ సెన్సేషనల్ చిత్రం ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఇక నుంచి నాన్ ట్రిపుల్ రికార్డు ట్రెండ్ ని సెట్ చేసి పారేసింది.
అయితే నిన్న ఆదివారం తో ఈ సినిమా ఎంతో కీలకమైన రన్ ని పూర్తి చేసుకోగా ఇప్పుడు 11వ రోజుకి వచ్చింది. అయితే ఈ సినిమా అసలు రన్ ఇప్పుడు నుంచే ఉండొచ్చని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఇది వరకు చాలా మంది ఈ భారీ టికెట్ ధరలతో ఆగిపోయారు.
కానీ ఇప్పుడు టికెట్ ధరలు తగ్గడంతో ఖచ్చితంగా ఈరోజు నుంచి మరింత మంది చూసే అవకాశం గట్టిగా ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీనితో ఈరోజు నుంచి కూడా ఈ సినిమా వసూళ్లు స్టడీ గా కొనసాగుతాయని తెలుస్తోంది.
అయితే ఇది కాస్త హార్డ్ టాస్క్ అయినా ఎలాగో సరైన సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమా కి ఇంకా ఛాన్స్ ఉందని చెప్పాలి. మరి ఈరోజు వసూళ్లు ఎలా ఉంటాయో అనేది వివరాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇక ఈ భారీ సినిమాలో ఆలియా భట్ మరియు ఒలివియా మోరిస్ లు హీరోయిన్ లుగా నటించగా బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించారు. అలాగే ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాని డివివి దానయ్య భారీ వ్యయంతో నిర్మాణం వహించారు.