ఆర్ఆర్ఆర్ సినిమా గే సినిమా.. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. మార్చి 24 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించాడు. నిజ జీవితం వీరిద్దరి మద్య లేని స్నేహం లేదు. కానీ రాజమౌళి వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని కల్పించి ఈ సినిమాలో చూపించాడు.

ఈ సినిమా చూసిన ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఆర్ఆర్ఆర్ చిత్రం ఒక అద్భుతం అంటూ ప్రశంశలు కురిపించారు. బాలీవుడ్ సినిమాలకు మించి టాలీవుడ్ సినిమాలు ఉండటంతో కొందరు హాలీవుడ్ ప్రేక్షకులు ఓర్వలేక ఈ సినిమా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సినిమా విడుదలైన ఎన్ని రోజులకి పని కట్టుకొని మరీ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు హాలీవుడ్ అభిమానులు, వెస్ట్రన్ ఆడియన్స్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ ని జీర్ణించుకోలేకపోతున్నారు.

అందువల్ల ఆర్ఆర్ఆర్ సినిమా గురించి సోషియల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేస్తూ విషం కక్కుతున్నారు. జాతీ అహంకారంతో కొందరు నెటిజన్స్ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒక గే మూవీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా సినిమాలోని కొన్ని సన్నివేశాలను స్క్రీన్ షాట్ తీసి మరి పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమా కొన్నిచోట్ల గే రొమాన్స్ మూవీ అనిపిస్తోంది అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ఆర్ఆర్ఆర్ లో మతిపోగోట్టే యాక్షన్ ఉండటం నిజమే.. సినిమా అడ్వెంచరస్ గా కూడా ఉంది. రివేంజ్ అన్నారు నిజమే.. కానీ ఈ సినిమా గే మూవీ అని ఎవరూ చెప్పలేదు ఏంటి ? అంటూ ఒక వెస్ట్రన్ నెటిజన్ వెటకారంగా ట్వీట్ చేశాడు. దీంతో ఇండియన్ అభిమానులు కూడా వారికి దీటుగా కామెంట్స్ చేస్తున్నారు.