సిద్ధం కండి..ఈ డేట్ న ‘RRR’ పై భారీ అప్డేట్.!?

మెగాపవర్ స్టార్ చరణ్ అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల నడుమ తెరకెక్కిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ “ట్రిపుల్ ఆర్” (RRR) కోసం అందరికీ తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన ఈ మహా కావ్యం భారీ స్థాయి బిజినెస్ జరుపుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది. అయితే గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమాపై ఓ బజ్ వైరల్ అవుతుంది. వచ్చే దీపావళి కానుకగా టీజర్ వస్తుంది అని. 
 
అయితే దీనిపైనే ఏమో కానీ ఈ సినిమా నుంచి మాత్రం ఏ భారీ అప్డేట్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారని తెలుస్తుంది. మరి దీనికి డేట్ కూడా వినిపిస్తుంది. వస్తే ఈ అక్టోబర్ 28 కానీ 29లలో ఆ భారీ అప్డేట్ ని చిత్ర యూనిట్ తెలుపనున్నారట. మొత్తానికి మాత్రం ఈ అప్డేట్ పై సినీ వర్గాల్లో టాక్ ఇప్పుడు విస్తృతంగా వినిపిస్తుంది. వేచి చూడాలి ఏం జరుగుద్దో మరి.