RRR Movie : తెలుగు సినిమాపై కామెంట్ చేసిన బాలీవుడ్ హీరో సినిమాని తొక్కేసిన “RRR”

RRR Movie : జస్ట్ గత కొన్ని రోజులు కితమే బాలీవుడ్ కి చెందినటువంటి స్టార్ హీరో జాన్ అబ్రహం చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో సంచలనంగా మారాయి. ముఖ్యంగా అయితే అతడు మన తెలుగు సినిమా పట్ల చేసిన కామెంట్స్ పెద్ద కలకలమే రేపాయి.
తాను తెలుగు సినిమా చెయ్యడమే జరగదని అందులోని సైడ్ హీరోగా చెయ్యడం అసలు కుదిరే పని కాదని షాకింగ్ కామెంట్స్ చేసాడు.
అయితే ఇదంతా తన యాక్షన్ సినిమా “ఎటాక్” ప్రమోషన్స్ లో అన్నాడు. సరే తాను అనేశాడు సినీ వర్గాల్లో కావాల్సినంత అటెన్షన్ కూడా వచ్చింది. కానీ తాను ఏదైతే తెలుగు సినిమా పై కామెంట్ చేసాడో అదే తెలుగు సినిమా ఇపుడు తన హిందీ ఇండస్ట్రీలోనే తొక్కేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ వసూళ్లతో హిట్ అయ్యిన ట్రిపుల్ ఆర్(RRR) చిత్రం ఊహించని లెవెల్లో హిందీలో కూడా అదిరే వసూళ్లు అందుకుంటుంది.
మరి నిన్న శుక్రవారమే ఈ సినిమా థియేటర్స్ లో ఉండగా జాన్ అబ్రహం సినిమా కూడా రిలీజ్ కాగా ఆ సినిమాకి జస్ట్ 3 కోట్లు హిందీలో వసూలు కాగా RRR కి మాత్రం 13 కోట్లు వచ్చాయి.
దీనితో బొమ్మ అందరికీ క్లియర్ అయ్యిపోయింది. ఇకనైనా ఇలాంటి కామెంట్స్ అతడు తగ్గించుకుంటే మంచిది అని మన వాళ్ళు అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఇపుడు శని, ఆదివారాల్లో కూడా RRR దరిదాపుల్లోకి కూడా జాన్ అబ్రహం సినిమా రాదనీ హిందీ ట్రేడ్ వర్గాలే చెబుతున్నారు.