RRR Movie Box Office : బాలీవుడ్ మార్కెట్ లో దుమ్ము లేపిన “RRR”..లేటెస్ట్ కలెక్షన్ వివరాలు.!

RRR Movie Box Office :  లేటెస్ట్ ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR). విజనరీ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ సినిమా లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు. అయితే ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాని ఎట్టకేలకు ఈ మార్చ్ 25న రిలీజ్ చేసి భారీ రెస్పాన్స్ తో పాటు భారీ వసూళ్లను కూడా చిత్ర బృందం అందుకున్నారు.

ఇప్పుడు 1000 కోట్ల మార్క్ కి దగ్గర అవుతున్న ఈ సినిమా హిందీ వసూళ్లకు సంబంధించిన వివరాలు తెలుస్తున్నాయి. బాలీవుడ్ మీడియా వర్గాలు కన్ఫర్మ్ చేసిన దాని ప్రకారం అయితే ఈ సినిమా నిన్నటి వసూళ్లతో అంటే ఏప్రిల్ 6తో 4 కోట్లు వసూలు చేసి 200 కోట్ల క్లబ్ లో చేరినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

దీనితో హిందీ మార్కెట్ లో 200 కోట్ల క్లబ్ లో చేరిన మరో సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. అలాగే ట్రేడ్ పండితులు అయితే మరో భారీ సినిమా “కేజీఎఫ్ 2” వచ్చే నాటికి RRR సినిమా మరో 50 కోట్లు మేర వసూలు చెయ్యొచ్చని అంటున్నారు. మరి లైఫ్ లో హిందీలో ఎక్కడ ఆగుతుందో చూడాలి. అలాగే బాహుబలి 2 తో పోలిస్తే అక్కడ ఈ సినిమా దరిదాపుల్లోకి కూడా రాలేదని చెప్పాలి.