RRR : ‘ఆర్ఆర్ఆర్’ ఇక్కడితో ఆగిపోకూడదు.!

RRR :  తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాల చాటి చెప్పిన సినిమా ‘బాహుబలి’. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్.. అంటూ రెండు పార్టులుగా ఈ సినిమాని తెరకెక్కించి ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు జక్కన్న రాజమౌళి.
ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’. ‘ఆర్ఆర్ఆర్’తో మరోసారి  అలాంటి కీర్తినే దక్కించుకున్నాడు జక్కన్న. తెలుగు సినిమాకి ఆ స్థాయి గౌరవాన్ని అంతకు మించిన స్థాయిలో దక్కేలా చేశాడు. అలాంటి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అక్కడితో ఆగిపోకూడదు.
కొన్ని సిరీస్‌ల మాదిరి వస్తూనే వుండాలి. అప్పుడే మన తెలుగు సినిమా ఎదుగుదల అక్కడితో ఆగిపోకుండా వుంటుంది.. అని సినీ మేధావులు అభిప్రాయపడుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. అయితే, ‘ఆర్ఆర్ఆర్’‌కి ఆ సత్తా వుందా.? అది రాజమౌళి చేతుల్లోనే వుంది. ఆయనే ఆ విషయాన్ని తేల్చాల్సి వుంది.
బాలీవుడ్‌లో టైగర్ ష్రాఫ్ నటించిన ‘బాఘీ’ చిత్రం పార్టులు, పార్టులుగా రిలీజ్ అవుతూనే వుంది. అలాగే, ‘ఆర్ఆర్ఆర్’ సిరీస్ కూడా కంటిన్యూ చేస్తే బావుంటుందని సినీ ప్రియులు కూడా  అభిప్రాయపడుతున్నారు.
మరి ఆయా అభిప్రాయాల పట్ల జక్కన్న రాజమౌళి రెస్పాన్స్ ఎలా వుండనుందో చూడాలి మరి.