బిగ్ స్క్రీన్స్ దద్దరిల్లేలా ‘RRR’ ఊరనాటు బీటు…

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాస్ సాంగ్ ట్రిపుల్ ఆర్(RRR) నుంచి రానే వచ్చేసింది. భారీ అంచనాల నడుమ ఇద్దరి మాస్ హీరోలపై అంతకు మించిన సాంగ్ “నాటు నాటు” ని చిత్ర బృందం ఒక గంట ముందే ఇచ్చేసారు.

ఇక సాంగ్ విషయానికి వస్తే కీరవాణి నుంచి మళ్ళీ తన మాస్ యాంగిల్ లో నెక్స్ట్ లెవెల్లో ఇచ్చేసారు. ఇంకా ఈ సాంగ్ సెటప్ చూస్తే విదేశీ గడ్డపై కొమరం భీం ఎన్టీఆర్, సీతారామ రాజు చరణ్ లు దుమ్ము లేపబోతున్నట్టు అర్దహం అయ్యిపోతుంది.

Naatu Naatu Song (Telugu)| RRR Songs NTR,Ram Charan | MM Keeravaani | SS Rajamouli|Telugu Songs 2021

సాంగ్ స్టార్టింగ్ బిట్ లో లాస్ట్ బిట్ లో ఇద్దరు హీరోలు చేసిన మాస్ స్టెప్స్ చూస్తుంటే బిగ్ స్క్రీన్స్ దద్దరిల్లిపోవడం గ్యారెంటీ ఇందులో ఇంకో మాట లేదు అంతే.. ఈ సాంగ్ తో ఇక మాస్ వీరంగం అంటే ఏంటో కూడా చూస్తాం. ఫైనల్ గా రాజమౌళి కి బిగ్ శాల్యూట్ అంతే ఆడియెన్స్ పల్స్ తో అలా ఆటాడుకోవాలో తనకి బాగా తెలుసు అని ఈ సాంగ్ తో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు.