RRR Collections : ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్ళు ఓ వైపు, వివాదాలు ఇంకో వైపు.!

RRR Collections :  తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచేలా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. వసూళ్ళ సునామీ కొనసాగుతోంది. అటు వైపు వసూళ్ళు, ఇంకో వైపు వివాదాలు అలా కొనసాగుతూనే వున్నాయి.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అల్లూరి సీతారామరాజుని అవమనించేలా సన్నివేశాలున్నాయనీ, కొమరం భీమ్ పాత్రని అభ్యంతరకరంగా తీర్చిదిద్దారనీ సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతోంది.

ఆ రచ్చ సంగతి పక్కన పెడితే, యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు తమ అభిమాన హీరోకి సినిమాలో తక్కువ ప్రాధాన్యత దక్కుతోందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రామ్‌చరణ్ మీద అలాగే దర్శకుడు రాజమౌళి మీదా జుగుప్సాకరమైన రీతిలో ఆరోపణలు చేస్తుండడం గమనార్హం.

ఎన్టీయార్ కూడా ఈ విషయంలో అసంతృప్తితో వున్నాడంటూ ప్రచారం చేస్తుండడంతో, రేపో మాపో ఈ విషయమై ఎన్టీయార్ వివరణ ఇచ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కానీ, ఎన్టీయార్ అలా వివరణ ఇస్తాడా.? ఇవ్వడా.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి.

చరణ్ పుట్టినరోజు నేపథ్యంలో ఎన్టీయార్ పార్టీ ఇవ్వడంతోనే.. ఈ వివాదాలకు ముగింపు పలికాడని చాలామంది అంటున్నా, వివాదాలు మాత్రం ఆగడంలేదు.

కాగా, రాజమౌళి సినిమా సక్సెస్ ఫంక్షన్‌ని త్వరలో నిర్వహించాలనుకుంటున్నాడట. అలా మళ్ళీ చరణ్ – ఎన్టీయార్ బహిరంగంగా మీడియా ముందుకు వస్తే.. వివాదాలకు కాస్త ముగింపు పడుతుందేమో.!