బిగ్ బాస్ విన్నర్ పై రౌడీషీటర్ దాడి.. పోలీస్ కేసు నమోదు చేసిన సన్నీ?

బుల్లి తెర పై పలు టీవీ సీరియల్స్ లో నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న నటుడు సన్నీ అదే పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఎవరూ ఊహించని విధంగా రోజురోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకొని చివరికి విన్నర్ గా నిలిచారు.ఈ విధంగా అన్ని బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ఆయనకు పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో సన్నీ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటూ బిజీగా ఉన్నారు.ఇకపోతే ఒక సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లోని హస్తినాపురం ప్రాంతంలో బుధవారం షూటింగ్ నిర్వహించారు. ఈ విధంగా షూటింగ్ జరుగుతుండగా ఒక రౌడి షీటర్ బిగ్ బాస్ విన్నర్ సన్నీ పై దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఈ దాడిలో సన్నికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయం గుర్తించిన సిబ్బంది వెంటనే తనని సురక్షితంగా కారులో పంపించారు.

ఈ విధంగా షూటింగ్ లోకేషన్ నుంచి సరాసరి సన్నీ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రౌడీషీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే రౌడీషీటర్ సన్నీ పై దాడి చేయడానికి కారణం ఏంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు.