అడవి శేష్ మీద సినిమాపై ప్రశంసలు కురిపించిన రౌడీ హీరో విజయ్?

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం మేజర్.ముంబై దాడులలో టెర్రర్ ఘాతుకానికి బలైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ఈ చిత్రాన్ని మహేష్ బాబు నిర్మాణంలో, పాన్ ఇండియా స్థాయిలో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు.ఈ సినిమా జూన్ 3వ తేదీ విడుదల అయ్యి పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాపై ఎంతో మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సైతం ఎంతో ఎమోషనల్ అవుతూ సినిమా గురించి వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా అంటూ,ఇంత మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన నిర్మాత మహేష్ బాబు కు కృతజ్ఞతలు అంటూ ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఇకపోతే తాజాగా మేజర్ సినిమాపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ…ప్యాషన్‌తో.. ప్రేమతో.. ఎంతో హృద్యయంగా ఈ సినిమాను తెరకెక్కించరంటూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఇందులో అడివి శేష్ ఎంతో అద్భుతంగా నటించారని ఆయన నటన పై విజయ్ దేవరకొండ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మేజర్ సినిమాపై విజయ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.