” రొమాంటిక్ ” లో రొమాన్స్ సరే సినిమాలో అది ఉంటుందా ..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇండస్ట్రీకి వారసులు రావడం కొత్తేమి కాదు. అయితే వచ్చినవాళ్ళందరు సక్సస్ అవడమన్నదే గొప్ప విషయం. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు, దర్శకుల వారసులు వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కునే ప్రయత్నాలు చేసినప్పటికి ఎక్కువశాతం కనిపించకుండాపోయిన వాళ్ళే ఉన్నారు. ఈ క్రమంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరి కొడుకు ఆకాష్ హీరోగా మారాడు.

Ketika Sharma goes topless for Romantic's poster starring Akash Puri; check  out

ప్రస్తుతం ఆకాష్ హీరోగా నటిస్తోన్న రెండవ సినిమా ‘రొమాంటిక్’. కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పూరి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్ పాదూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లాక్ డౌన్ కి ముందే దాదాపు కంప్లీట్ అయిన ఈ సినిమా కి బ్యాలెన్స్ వర్క్ ఇటీవలే కంప్లీటయింది. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయినట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు పూరి. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఆకాష్ కి తల్లిగా నటిస్తుందన్న సమాచారం.

ఇక పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా పూరి కి బాగా అలవాటైన మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే క్యూట్ లవ్ స్టోరీగా రొమాంటిక్ తెరకెక్కిందట. అయితే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ చూసిన చాలా మంది మరో ఇడియట్ లా కనిపిస్తుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంతేకాదు రెగ్యులర్ గా అనిపిస్తుందన్న కామెంట్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. రొమాన్స్ ఉండటం కాదు అసలు కథ ఉందా ఈ సినిమాలో అన్న మాటలు వినిపిస్తున్నాయి.

అయితే పూరి కం బ్యాక్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి కూడా ఇలాంటి కామెంట్స్ వినిపించాయి. సినిమా రిలీజయ్యాక బ్లాక్ బస్టర్స్ అందుకొని అందరి నోరు మూత పడేలా చేసింది. ఇప్పుడు పూరి బృందం కూడా రొమాంటిక్ సినిమా విషయంలో ఇలాగే ఆలోచిస్తున్నారట. చూడాలి మరి ఈ సినిమా ఎంతటి సక్సస్ ని అందుకుంటుందో. కాగా ఆకాష్ పూరి డెబ్యూ సినిమా మెహబూబా సక్సస్ అందుకోలేకపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే.