Roja: చంద్రబాబు మత్తులో పవన్ కళ్యాణ్ ఉన్నారు… కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయిన రోజా?

Roja: సినీనటి వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక బృందంతో దావోస్ పర్యటన వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక్క ఎంవోయూ కూడా చేపట్టకపోవడపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. 20 కోట్ల రూపాయల ఖర్చుతో స్పెషల్ ఫ్లైట్ లో సూటు బూటు వేసుకొని చంద్రబాబు నాయుడు లోకేష్ ఒక్క ఎంవోయూ కూడా తీసుకురాకపోవడం ఎంతో సిగ్గుచేటు అని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రారని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇలాంటి తరుణంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారని తెలిపారు. ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టడం, నడిరోడ్డుపైనే మనుషులను నరికి చంపడం, రాష్ట్రవ్యాప్తంగా అమ్మాయిలపై అత్యాచారాలు చేయడం వంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రారని తెలిపారు.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ప్రాజెక్టులన్ని కూడా జగన్మోహన్ రెడ్డి హయామంలోనే రాష్ట్రానికి వచ్చినవని రోజా గుర్తు చేశారు. గత 7 నెలల పాలనలో రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం చేసిన మంచి ఏమీ లేదని ఎంతోమంది ప్రభుత్వం కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారని రోజా తెలిపారు. ఇక జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మత్తులో ఉన్నారు. లోకేష్ చంద్రబాబు మాత్రమే దావోస్ వెళ్లారు. పవన్ కళ్యాణ్ ని ఎందుకు తీసుకువెళ్లలేదు అంటూ ఈమె ప్రశ్నించారు.

కూటమి ఏడు నెలల పాలనలో రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయింది కలియుగ దైవమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి పై కూడా ఎన్నో నిందలు వేస్తూ అబద్ధాలు చెప్పారు. ఇటీవల తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా బాధితులకు ఇప్పటివరకు సహాయం అందించడంలో కూడా విఫలమయ్యారు అంటూ కూటమి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ రోజా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.