తన బాడీ షేమింగ్ గురించీ వస్తున్న వార్తలపై స్పందించిన రోహిణీ.. బయటకి నవ్వినా కూడా లోపల..!

బుల్లితెర నటి, జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన రోహిణి ఒక సీరియల్ లో నటించి బాగా పాపులర్ అయ్యింది. అయితే అనారోగ్యం కారణంగా కొంత కాలం ఇండస్ట్రీకి దూరమైన రోహిణి తర్వాత జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీ కి రీఎంట్రీ ఇచ్చింది. బుల్లితెర నటి గా వచ్చిన గుర్తింపు కన్నా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు లభించింది. జబర్దస్త్ స్టేజ్ మీద రోహిణి పంచ్ లకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. జబర్దస్త్ ద్వార పాపులర్ అయిన రోహిణి సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది.

ప్రస్తుతం జబర్ధస్త్ తో పాటు పలు టీవి షో లలో సండడి చేస్తోంది. అంతేకాకుండా సినిమాలలో కూడా మంచి మంచి పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది. ఒకవైపు టీవీ షో లో మరొకవైపు సినిమాలతో బిజీగా ఉండే రోహిణి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఫన్నీ వీడియోలు ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. తన కష్టార్జితంతో సొంత ఇంటి కల నెరవేర్చుకుంది రోహిణి ఇటీవల తన కొత్త ఇంటికి సంబందించిన హోం టూర్ వీడియోస్ కూడా సోషియల్ మీడియా లో షేర్ చేసింది. తన మాటలతో అందరినీ నవ్వించే రోహిణి మనసులో మాత్రం ఎంతో బాధని అనుభవిస్తోంది.

రోహిణీ కొంచం బొద్దుగా ఉండటం వల్ల జబర్ధస్త్ లో తరచు ఆమె పర్సనాలిటీ గురించి పంచులు వేస్తుంటారు. అలా తన గురించి బాడీ షేమింగ్ చేసిన కూడా ప్రేక్షకులని అలరించటనికి నవ్వుతూ ఉండే రోహిణి మనసులో మాత్రం చాలా బాధని అనుభవిస్తోంది. ఇటీవల రోహిణి ఈ విషయం గురించి స్పందిస్తూ… ” స్నేహితులతో కలిసినప్పుడు నేను లావుగా ఉండడం ఎన్నో రకాలుగా బూతులు తిట్టుకుంటూ ఉంటాం. కానీ అప్పుడు అంత బాధగా అనిపించదు. కానీ స్కిట్ లో బాడీ షేమింగ్ విషయం వచ్చేసరికి బయటకి నవ్వుతూ ఉన్న కూడా లోపల మాత్రం ఫీల్ అవుతూ ఉంటా”. అంటూ రోహిణి తెలియచేసింది.